సారథి న్యూస్, హైదరాబాద్: ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా, గోదావరి నదుల్లో మన హక్కు నీటివాటాను కాపాడుకుని తీరాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు సూచించారు. గురువారం మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఒక చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టంచేశారు. ఎంతటి పోరాటానికైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఆగస్టు 5న ఏర్పాటు చేసేందుకు అభిప్రాయం చెప్పాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ముఖ్యకార్యదర్శి యూపీ సింగ్ రాసిన లేఖపై చర్చించారు.
అనంతరం నీటిపారుదల శాఖ సలహాదారు శైలేంద్ర కుమార్ జోషి రాసిన ‘ఏకో- టి- కాలింగ్’ పుస్తకాన్ని సీఎం కేసీఆర్ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు. సమావేశంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, సీఎం ముఖ్యకార్యదర్శి స్మితాసబర్వాల్, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ పాల్గొన్నారు.