సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం గురువారం ప్రారంభమైన ఓటరు నమోదు కార్యక్రమం సందర్భంగా ఓటర్ లిస్టులో తన పేరును మంత్రి కె.తారక రామారావు నమోదు చేసుకున్నారు. ప్రగతి భవన్ లో ఇందుకు సంబంధించిన పత్రాలను స్థానిక మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ఉన్నత విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు తమ పేరును కచ్చితంగా ఓటర్ లిస్ట్ లో నమోదు చేసుకోవాలని, ఎన్నికల్లో మొత్తం ఓటర్ లిస్ట్ తాజా ఓటర్ల నమోదు ఆధారంగానే ఉంటుందన్నారు. గతంలో ఓటరుగా నమోదైన వారు సైతం మరోసారి నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. 2017 నవంబర్ నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లు అందరూ ఓటర్ లిస్టు లో తమ పేరు నమోదు చేసుకునేందుకు అర్హులేనని ఆయన స్పష్టంచేశారు.
- October 1, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- GRADUATE
- KTR
- MLC ELECTIONS
- TELANGANA
- ఎమ్మెల్సీ ఎన్నికలు
- కేటీఆర్
- గ్రాడ్యుయేట్ ఓటర్
- తెలంగాణ
- Comments Off on గ్రాడ్యుయేట్ ఓటర్ గా కేటీఆర్ పేరు నమోదు