సారథి న్యూస్, హైదరాబాద్: సినీనేపథ్య గాయకుడు ఎస్పీ బాలసబ్రహ్మణ్యం మృతి పట్ల సీఎం కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఎన్నో సుమధుర గేయాలు ఆలపించిన బాలు భారతీయ ప్రజలందరికీ అభిమాని అయ్యారని అన్నారు. ఆయన ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం దురదృష్టకరమన్నారు. ఆయన లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిదని అన్నారు. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయన సినీలోకానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- September 25, 2020
- Archive
- Top News
- సినిమా
- CM KCR
- SINGER
- SP BALU
- TELANGANA
- TOLLYWOOD
- ఎస్పీ బాలు
- టాలీవుడ్
- బాలీవుడ్
- సినీగాయకుడు
- సీఎం కేసీఆర్
- Comments Off on గొప్ప వ్యక్తిని కోల్పోయాం: సీఎం కేసీఆర్