హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్బాలరాజు నాగరాజు లంచం కేసు అవినీతిలో గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కేలా ఉంది. ఓ భూమికి పట్టా ఇచ్చే విషయంలో రూ.రెండు కోట్లకు డీల్ కుదుర్చుకుని, ఏకంగా రూ.1.1 కోట్లు లంచం తీసుకుని పట్టుబడిన విషయం తెలిసిందే. ఓ ప్రభుత్వ ఉద్యోగి, దాదాపు 20 మిలియన్ డాలర్ల లంచం స్వీకరిస్తూ పట్టుబడడం ఇదే తొలిసారి అని, ఆయన పేరును రికార్డుల్లోకి ఎక్కించాలని కోరుతూ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రెండు స్వచ్ఛంద సంస్థలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు అధికారులను కోరగా.. ప్రతినిధులు స్పందించారు. ఇప్పటివరకు ప్రభుత్వ అధికారుల అవినీతికి కేటగిరీ లేదని, దీనికోసం ఓ కొత్త కేటగిరీని ప్రారంభించే అవకాశాన్ని పరిశీలిస్తామని గిన్నిస్ ప్రతినిధులు తెలిపారని జ్వాల సంస్థ ప్రెసిడెంట్ ఎస్.ప్రశాంత్ తెలిపారు.
- August 26, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- GUINNESS BOOK RECORD
- HYDERABAD
- KESARA TAHASHILDAR
- కీసర తహసీల్దార్
- గిన్నిస్బుక్
- హైదరాబాద్
- Comments Off on గిన్నిస్ బుక్లోకి కీసర తహసీల్దార్ లంచం కేసు