సారథిన్యూస్, అమరావతి: పండితులు, కొన్నివర్గాలకే పరిమితమైన తెలుగుభాషను గిడుగు రామ్మూర్తి పంతులు సరళతరం చేశారని.. ఆయన సేవలను తెలుగుజాతి ఎప్పటికీ మరువబోదని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనియాడారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా శనివారం తెలుగు భాషా దినోత్సవం నిర్వహించుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ట్వీట్ చేశారు. గిడుగు రామ్మూర్తి గ్రాంథికంలో ఉన్న తెలుగు భాషనను వ్యవహారికభాషలోకి మార్చిన గొప్పవ్యక్తి అని పేర్కొన్నారు. యువత గిడుగు రామ్మూర్తి పంతులు గురించి తెలుసుకోవాలని.. తెలుగు భాష పరిరక్షణకు నడుం బిగించాలని సూచించారు. ఈ మేరకు శనివారం సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘పండితులకే పరిమితమైన సాహిత్యాన్ని.. సరళతరం చేసిన మహనీయుడు గిడుగు.. ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం తెలుగుని సన్మానించుకోవడమే’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
- August 29, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- ANDHRAPRADESH
- APCM
- TWEET
- YS JAGAN
- ఆంధ్రప్రదేశ్
- ట్వీట్
- వైఎస్జగన్
- Comments Off on ‘గిడుగు’ సేవలు అజరామరం