న్యూఢిల్లీ: గాంధీ ఫ్యామిలీకి చెందిన మూడు ట్రస్టులపై కేంద్ర హోంశాఖ విచారణకు ఆదేశించింది. దీని కోసం గవర్నమెంట్ ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు హోంశాఖ అధికార ప్రతినిధి బుధవారం ఉదయం ట్వీట్ చేశారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్‌కు చెందిన ఫారెన్ డొనేషన్స్, ఇన్‌కమ్‌ట్యాక్స్ వయలేషన్లపై ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ఇంటర్ మినిస్ట్రల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎమ్‌ఎల్‌ఏ), ఇన్‌కమ్ ట్యాక్స్, ఫారెన్ కంట్రిబ్యూషన్ యాక్ట్ ఉల్లంఘనలు చేశారని, అందుకే విచారణ చేపడుతున్నామని హోం మినిస్ట్రీ అధికారులు చెప్పారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్పెషల్ డైరెక్టర్ ఈ కమిటీకి హెడ్‌గా వ్యవహరించనున్నారు.
దేశపరిస్థితులను డైవర్ట్ చేసేందుకే
అయితే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇన్వెస్టిగేషన్‌కి ఆదేశించారని కాంగ్రెస్ ఆరోపించింది. చైనాతో నెలకొన్న పరిస్థితుల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు బీజేపీ ఆడుతోన్న నాటకమని కాంగ్రెస్ నేతలు అన్నారు. 1991 జూన్‌లో ప్రారంభించిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్, 2002లో ప్రారంభమైన రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్‌కు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చైర్మన్‌గా ఉన్నారు. కాగా, మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆ ట్రస్టులకు డబ్బులు ఇచ్చారని బీజేపీ నేతలు ఆరోపించారు. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ ఏవైనా ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు డొనేట్ చేయాలని ట్రస్ట్‌లకు ఇచ్చేందుకు కాదని అన్నారు. 1991లో అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్‌సింగ్ కూడా బడ్జెట్ స్పీచ్‌లో రాజీవ్ గాంధీ ట్రస్ట్‌కు రూ.వంద కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారని బీజేపీ ఆరోపించింది.