Breaking News

కేటీఆర్​కు అరుదైన కానుక

కేటీఆర్​కు అరుదైన కానుక

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు జన్మదినం సందర్భంగా శుక్రవారం ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అపురూపమైన కానుకను అందజేశారు. కేటీఆర్​ బాల్యం, విద్యాభ్యాసం, రాజకీయం, కెరియర్ విజయాలు, ప్రపంచవ్యాప్తంగా చేసిన పర్యటనలు, ప్రజల కోసం చేసిన పోరాటాలు, హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దడంలో చేసిన కృషిని వివరిస్తున్న దృశ్యమాలికలతో పెయింటింగ్​ వేయించారు. ఈ చిత్రాన్ని ఉప్పల శ్రీనివాస్ గుప్తా తన కుమారులు సాయికిరణ్, సాయితేజ, చిత్రకారుడు వెంకటేష్ తో కలిసి ప్రగతి భవన్ లో అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్​ను అభినందించారు.