సిద్దిపేట: నిన్నటి దాకా హైదరాబాద్ మహానగర ఎన్నికల హడావుడిలో ఉన్న మంత్రి టి.హరీశ్‌రావు ఆటవిడుపుగా సిద్దిపేటలో జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లో బ్యాట్ పట్టి కొద్దిసేపు అలరించారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్‌కు కెప్టెన్‌గా బరిలోకి దిగారు. అయితే తన టీమ్ 3 వికెట్లు కోల్పోయిన సమయంలో మంత్రి హరీశ్ రావు క్రీజ్‌లోకి దిగారు. దిగడంతో బంతిని బౌండరీ లైన్ వైపునకు బాదుతూ దూకుడుగా బ్యాటింగ్ చేశారు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ సునాయాసంగా పరుగులు తీస్తూ వరుసగా రెండు ఫోర్లు కొట్టారు. 12 బంతుల్లో 18 పరుగులు చేసి మంత్రి హరీశ్ రావు ఔటయ్యారు. అభిమానులను, ప్రేక్షకులను అలరించేలా హరీష్ రావు బ్యాటింగ్ సాగింది. రాజకీయాల్లో మాత్రమే కాకుండా క్రికెట్‌లో కూడా తనదైన వ్యూహాలతో టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. బ్యాటింగ్‌లో దూకుడు ప్రదర్శించి శభాష్ అనిపించుకున్నారు. ఆయన బ్యాటింగ్ చేస్తున్నంత సేపు అభిమానులు, ప్రేక్షకులను కేరింతలు కొడుతూ, ఈలలు వేస్తూ తెగ సందడి చేశారు.
- December 2, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- ముఖ్యమైన వార్తలు
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CM KCR
- FRIENDLY MATCH
- HARISHRAO
- SIDDIPETA
- TELANGANA
- తెలంగాణ
- ఫ్రెండ్లీ క్రికెట్
- సిద్దిపేట
- సీఎం కేసీఆర్
- హరీశ్‌రావు
- Comments Off on కెప్టెన్ హరీశ్ రావు .. ఫోర్లే ఫోర్లు