న్యూఢిల్లీ: కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి వ్యక్తిగత వెబ్సైట్ హ్యాక్‌కు గురైంది. తన వెబ్సైట్లో పాకిస్థాన్‌కు అనుకూలంగా పోస్టులు ఉండటంతో ఆయన ఈ విషయాన్ని గుర్తించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున కిషన్‌రెడ్డి వెబ్‌సైట్‌ను హ్యాక్‌చేసిన దుండగులు ‘అందులో కశ్మీర్ ఆజాదీ’ అంటూ పోస్టులు పెట్టారు. దీంతో పాటు మనదేశానికి సంబంధించిన వ్యతిరేక పోస్టులు పెట్టారు. కాగా ఈ విషయంపై కిషన్‌రెడ్డి సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సాంకేతిక బృందం వెబ్‌సైట్‌ను పునరుద్ధరిస్తోంది. కిషన్‌రెడ్డి వెబ్‌సైట్‌ను ఉగ్రవాదులు హ్యాక్ చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
- August 26, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CYBERCRIME
- HOME
- HYDERABAD
- KISHANREDDY
- MINISTER
- కేంద్రమంత్రి
- హ్యాక్
- Comments Off on కిషన్‌రెడ్డి వెబ్సైట్ హ్యాక్