సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(కేఎల్ఐ)లో భాగమైన గుడిపల్లి లిఫ్ట్ -3 నుంచి ఆదివారం వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. దీంతో కృష్ణాజలాలు కాల్వల వెంట పరుగులు తీశాయి. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ పద్మావతి, కలెక్టర్ ఎల్ శర్మన్, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
- August 2, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- మహబూబ్‌నగర్
- GUDIPALLYLIFT
- KLI LIFT
- MINISTER NIRANJANREDY
- కేఎల్ఐ
- గుడిపల్లి లిఫ్ట్
- నాగర్‌కర్నూల్
- సింగిరెడ్డి
- Comments Off on ‘కల్వకుర్తి’కి నీటివిడుదల