Breaking News

కర్నూలులో మిన్నంటిన సంబరాలు

కర్నూలులో మిన్నంటిన సంబరాలు

సారథి న్యూస్​, కర్నూలు: కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ సమీపంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద కర్నూలు ఎమ్మెల్యే హఫిజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఆదివారం వైఎస్సార్​సీపీ విద్యార్థి విభాగం నాయకులు సంబరాలు జరుపుకున్నారు. సీఎం వైఎస్​ జగన్​ మోహన్​రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. న్యాయ రాజధాని ద్వారా విద్యాసంస్థలు, యూనివర్సిటీలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్​సీపీ విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి కటిక గౌతమ్, భాను ప్రకాశ్​, ఖయూమ్, సాయికృష్ణారెడ్డి, కృష్ణకాంత్ రెడ్డి, అసిఫ్ ఆదిమోహన్ రెడ్డి, సాంబశివారెడ్డి, రవి బాబు, జమిలా, విజయలక్ష్మి పాల్గొన్నారు.