సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో సోమవారం కొత్తగా 872 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతిచెందారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,674కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,005 మంది కరోనా బారినపడి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం మృతుల సంఖ్య 217గా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,452 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 713 ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 107 కేసులు, మేడ్చల్ 16, సంగారెడ్డి 12 చొప్పున కేసులు నమోదయ్యాయి.
- June 22, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CAROONA
- HYDERABAD
- జీహెచ్‌ఎంసీ
- తెలంగాణ
- సోమవారం
- Comments Off on కరోనా @ 872