Breaking News

కరోనా లక్షణాలుంటే లీవ్​ తీసుకోండి

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా(కోవిడ్​–19) వైరస్ బారిన పడుతున్న పోలీసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ మరింత అప్రమత్తమైంది. అనారోగ్యంతో బాధపడుతున్న పోలీసు అధికారులు, సిబ్బంది విశ్రాంతి తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారని, తద్వారా కొందరు పోలీసులు వైరస్ బారిన పడ్డారని వెల్లడించారు.

డ్యూటీలో ఉన్న పోలీసులు అధికారులు, సిబ్బంది కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే సెలవు పెట్టాలని బుధవారం సూచించారు. ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటే వైరస్ ఇతరులకు ప్రబలకుండా ఉంటుందని ఆయన చెప్పారు. సెలవులు అడిగిన వెంటనే అనుమతి ఇవ్వాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు.