Breaking News

కరోనా పేషెంట్​లో ధైర్యం నింపుదాం

కరోనా పేషెంట్​లో ధైర్యం నింపుదాం
  • భయంతోనే ఎక్కువ మంది చనిపోతున్నారు
  • తెలంగాణ రాష్ట్రమంతా ఒకే వైద్యావిధానం
  • డాక్టర్లతో వైద్యాశాఖ మంత్రి ఈటల వీడియోకాన్ఫరెన్స్​

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా ట్రీట్​మెంట్​కు సంబంధించి తెలంగాణ రాష్ట్రమంతా ఒకే వైద్యవిధానాన్ని అనురిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్​ స్పష్టంచేశారు. సోమవారం ఆయన రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, వైద్యనిపుణులతో వీడియోకాన్ఫరెన్స్ ​నిర్వహించారు. కరోనా వచ్చినవారు జబ్బుతో కంటే భయంతోనే ఎక్కువ మంది చనిపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. పాజిటివ్ నిర్ధారణ అయిన పేషెంట్​లో ధైర్యం నింపాలని పిలుపునిచ్చారు. యాంటీ వైరల్ మందుల కంటే స్టెరాయిడ్ మందులు ఎక్కువ మందికి నయం చేస్తాయన్నారు. సీటీ స్కాన్ వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్నారు. ఎంత తొందరగా చికిత్స మొదలుపెడితే మరణాలను అంత తగ్గించవచ్చని అన్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ విజయ్, హైదరాబాద్ కు చెందిన డాక్టర్​ఎంవీ రావు, డాక్టర్​సునీత, చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్​డాక్టర్​మహబూబ్ ఖాన్, ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్​డాక్టర్​శంకర్, నిమ్స్​వైద్యులు డాక్టర్​గంగాధర్ పలు విషయాలను మంత్రితో పంచుకున్నారు.