న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్‌లో దారుణం చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిన 34 ఏళ్ల జర్నలిస్ట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎయిమ్స్ బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. హిందీ డైలీ ‘డైనిక్ భాస్కర్’ పేపర్‌లో పనిచేస్తున్న జర్నలిస్ట్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో భయపడిపోయిన ఆయన రెండు రోజుల నుంచి కొలీగ్స్, ఫ్రెండ్స్‌కు డిప్రెషన్ మెసేజ్‌లు పంపడం మొదలుపెట్టాడు. జర్నిలిస్టులు పరిస్థితి మరీ దారుణంగా తయారైందని, చాలా సార్లు వాళ్ల కొలీగ్స్‌కి మెసేజ్‌లు పంపాడని పోలీసులు చెప్పారు. ఆ భయంతోనే ఎయిమ్స్ బిల్డింగ్ నుంచి దూకాడని పోలీసులు చెప్పారు. తీవ్ర గాయాలపాలైన అతడు ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయినట్లు చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భజన్‌పురా ఏరియాలో నివాసం ఉంటున్నాడు.
- July 6, 2020
- Archive
- Top News
- జాతీయం
- AIMS
- DELHI
- JOURNALIST
- SUICIDE
- కరోనా
- జర్నలిస్టు
- ఢిల్లీ ఎయిమ్స్
- సూసైడ్
- Comments Off on కరోనా పాజిటివ్.. జర్నలిస్ట్ సూసైడ్