సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్లోనూ కరోనా ఉధృతి పెరుగుతోంది. మహమ్మారి 16వేల మార్క్ దాటేసింది. శుక్రవారం ఒకేరోజు 789 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకుమొత్తం 16,934 కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 9,096 ఉన్నాయి. వ్యాధిబారిన పడిన 7,632 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నుంచి ఇప్పటి వరకు 206 మంది మృతి చెందారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 149, చిత్తూరు 47, తూర్పుగోదావరి 56, గుంటూరు 80, కడప 19, కృష్ణా 17, కర్నూలు 116, నెల్లూరు 15, ప్రకాశం 139, శ్రీకాకుళం 30, విశాఖపట్నం 54, విజయనగరం 10, వెస్ట్ గోదావరి 57, ఇతర రాష్ట్రాల వచ్చిన వారి నుంచి 46, ఇతర దేశాల నుంచి వచ్చిన వారి నుంచి రెండు పాజిటివ్కేసులు నమోదయ్యాయి.
- July 3, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- AP
- CAROONA
- Kurnool
- ఆంధ్రప్రదేశ్
- కరోనా
- కర్నూలు
- Comments Off on కరోనా ఉధృతి పెరుగుతోంది