సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం 1,676 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసులు 41,018 నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి తాజాగా 10 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య 396కు చేరింది. రాష్ట్రంలో 2,22,693 శాంపిళ్లను పరీక్షించారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్ఎంసీ పరిధిలో 788, రంగారెడ్డి 224, మేడ్చల్160, సంగారెడ్డి 57, వరంగల్అర్బన్ 47, కరీంనగర్92, మహబూబాబాద్19, మెదక్26, నల్లగొండ 64, నాగర్కర్నూల్30, వనపర్తి 51, సూర్యాపేట, నిజామాబాద్ జిల్లాల్లో 20 చొప్పున కేసులు నమోదయ్యాయి.