Breaking News

కరోనాను కంట్రోల్​ చేసేదెట్లా?

కరోనాను కంట్రోల్​ చేసేదెట్లా?
  • వణికిపోతున్న పల్లెజనం
  • ఏపీలో కొత్త ప్రాంతాలకు మహమ్మారి

సారథి న్యూస్, కర్నూలు: ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ఆంధ్రప్రదేశ్​లో పాగా వేస్తోంది. కరోనా వైరస్‌ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇటీవలే ప్రభుత్వం కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులకు కూడా చికిత్సల కోసం అనుమతులు ఇచ్చింది. కరోనా వైరస్‌ సోకిన వారికి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యసేవలు పొందేలా ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ట్రీట్​మెంట్​ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ప్రజల్లో కొంత సందేహం వ్యక్తమవుతోంది. కొన్ని ఆస్పత్రుల్లో వైద్యచికిత్సలు సరిగ్గా లేవని, దీంతో తాము హోం క్వారంటైన్‌లోనే ఉంటామని కొందరు మొండికేస్తున్నారు. వైద్యచికిత్సలు తీసుకోవడంతో పాటు మనోధైర్యంతో ఉండి పాజిటివ్‌గా ఆలోచించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. క్వారంటైన్‌లో పౌష్టికాహారంతో పాటు యోగా, వ్యాయామం చేయిస్తున్నామని, దీంతో పేషెంట్‌ త్వరగా కోరుకుంటున్నారని వైద్యాధికారులు చెబుతున్నారు. చికిత్సలో లోపం లేదని, డాక్టర్లను పూర్తిస్థాయిలో విశ్వసించి వైద్యచికిత్సలు పొందాలని సూచించారు. వైరస్‌ అంటుకున్న వ్యక్తికి ప్రత్యేకగది, బాత్‌రూం, భోజన వసతితో పాటు కుటుంబసభ్యుల సంపూర్ణ మద్దతుతో హోం క్వారంటైన్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తోంది. ఇంటిలో ఉన్నా వైద్యచికిత్సలు అందిస్తామని, అత్యవసరమైతే టోల్‌ ఫ్రీ నంబర్​కు కాల్‌ చేయాలని సూచిస్తున్నారు.
టెస్టులు ఆలస్యం
జిల్లాలో కరోనా ప్రబలిన వ్యక్తి ఇంటికి పోలీసు, రెవెన్యూ, గ్రామ, వార్డు సచివాయ సిబ్బందితో కలిసి వైద్యులు వచ్చి అంబులెన్స్‌లో ఎక్కించుకుని వెళ్తున్నారు. ఆ తర్వాత బాధిత కుటుంబసభ్యుల రక్తనమునాలు సేకరించి.. వారం పదిరోజులైనా రిపోర్టు రాకపోతే.. ఎలా? వారు ఇంట్లో ఉండకుండా ఇష్టానుసారంగా తిరిగి వైరస్‌ వ్యాప్తికి కారకువుతున్నారు. వైరస్‌ సోకిన వ్యక్తితో పాటు బాధిత కుటుంబీకులను వెంటనే పరీక్షించి వెంటనే రిపోర్టు ఇచ్చేవారు. ఈ ప్రక్రియ మూడు నెలల క్రితం బాగా అమలైంది. ఇప్పుడు కొంత ఆలస్యమవుతుందనే భావన ఉంది.
ఏపీలో కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 27,235 కేసులు నమోదు కాగా, అందులో 12,533 యాక్టివ్‌ కేసు, 14,393 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 309 మంది కరోనా వైరస్‌తో మృతిచెందారు. శనివారం ఒక్క రోజు ఏపీలో 1,813 కేసు నమోదు కాగా, అందులో 34 ఇతర రాష్ట్రా వారు కాగా, నలుగురు ఇతర దేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. అనంతపురంలో 311, ఈస్ట్‌ గోదావరి 143, చిత్తూరు 300, గుంటూరు 68, కడప 47, కృష్ణ 123, కర్నూలు 229, నెల్లూరు 76, ప్రకాశం 63, శ్రీకాకుళం 204, విశాఖపట్నం 51, విజయనగరం 76, వెస్ట్‌గోదావరి 84 చొప్పున కేసు నమోదయ్యాయి.