సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వైరస్ హైదరాబాద్ పోలీస్ శాఖలో భయం పుట్టిస్తోంది. డిపార్ట్మెంట్లో పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఏడుగురు పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, శుక్రవారం ఆ సంఖ్య 15కు చేరింది.. ఇప్పటి వరకు బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోనే 15 మంది పోలీసు అధికారులకు కరోనా సోకడంతో ఖాకీలు హడలిపోతున్నారు. మూడు రోజుల నుంచి మెడికల్ టెస్టుల్లో వరుసగా కరోనా కేసులు బయట పడుతున్నాయి. కనిపించని శత్రువు కరోనాతో ముందుండి పోరాటం చేస్తున్న పోలీసులను కరోనా వెంటాడడం ఆందోళన కలిగించే విషయమే. దీంతో అప్రమత్తమైన అధికారులు సరైన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
- June 12, 2020
- Top News
- తెలంగాణ
- HYDERABAD
- POLICE
- కరోనా
- ఖాకీలు
- బంజారాహిల్స్
- Comments Off on కరోనాతో ఖాకీల పోరాటం