సారథిన్యూస్, హైదరాబాద్: కరోనా మహమ్మారిని తగ్గించేందుకు రెమిడిసివిర్, ఫావిపిరవర్ మందులు కొంతమేర ప్రభావవంతంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ఔషధకంపెనీలు ఈ మందులను మార్కెట్లో విక్రయిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఔషధకంపెనీ రెడ్డీ ల్యాబ్స్కరోనా టాబ్లెట్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. అవిగాన్ బ్రాండ్ పేరుతో ఫావిపిరవిర్ 200 ఎంజీ టాబ్లెట్లను విడుదల చేస్తున్నట్లు బుధవారం డాక్టర్ రెడ్డీస్ బ్రాండెడ్ మార్కెట్స్ సీఈవో ఎంవీ రమణ తెలిపారు. వ్యాధి తీవ్రంగా లేనివారికి ఈ మందు మెరుగ్గా పనిచేస్తుందని సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఇక ఒక్కో అవిగాన్ ట్యాబ్లెట్ రూ.99 విలువ ఉంటుందని.. 122 ట్యాబ్లెట్ల కోర్సుగల ప్యాకేజీతో మార్కెట్లో లభ్యమవుతుందని తెలిపింది డాక్టర్ రెడ్డీస్. దేశవ్యాప్తంగా 42 నగరాల్లో ఉచితంగా హోమ్ డెలివరీ చేసేందుకు పలు సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది.
- August 19, 2020
- Archive
- Top News
- జాతీయం
- CARONA
- HYDERABAD
- MEDICINE
- REDDYLABS
- TELANGANA
- కరోనా
- రెడ్డీల్యాబ్స్
- హైదరాబాద్
- Comments Off on కరోనాకు రెడ్డీల్యాబ్స్ మందు