Breaking News

కరంటు బిల్లులు తక్కువ చేస్తం!

హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన కారణంగా విద్యుత్ బిల్లులో రికార్డు చేయలేదని.. ఆ సమయంలో అధికంగా వచ్చిన విద్యుత్ బిల్లులు తగ్గేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లు, శ్రీశైలం పవర్ హౌస్ లో జరిగిన అగ్నిప్రమాదంపై శాసనసభలో స్వల్ప కాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘కోవిడ్ సందర్భంలో విద్యుత్ బిల్లులు రికార్డు చేయలేదు కాబట్టి3 నెలలు కలిపి వేయడం ద్వారా ఎక్కువ బిల్లు వచ్చిందని సభ్యులు చెప్పారు ప్రజలకు భారం అవుతుందని చెప్పారు. అది వాస్తవము కావచ్చు.. కాకపోవచ్చు నాకు తెల్వదు. కానీ మీరు దృష్టికి తెచ్చినందుకు 100% ఇప్పుడే ఆర్డర్లు చేస్తా ఆ మూడు నెలలు డివైడెడ్ చేసి ఏదైనా భారం పడితే తొలగిస్తాం. ప్రజలపై పడనివ్వం’ అని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు.