తెలుగమ్మాయి అంజలి నటించిన బెలూన్ చిత్రాన్ని ఓటీటీలోనే రీలీజ్ చేయనున్నారు. అంజలి తెలుగులో అడపదడపా సినిమాల్లో నటించనప్పటికీ తమిళంలోనే బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం బెలూన్ అనే చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయాలని భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు నిర్మాతలు. అంజలి, తమిళ హీరో జై, జననీ అయ్యర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కామెడీ, హారర్‌గా తెరకెక్కుతున్నట్టు సమాచారం. జీ5లో బెలూన్ విడుదల కానుంది. రాజ్‌తరుణ్ అతిథి పాత్రలో నటించారు. శినీష్ దర్శకత్వం వహించారు. జూలై 10 నుంచి సినిమా స్ట్రీమింగ్ అవుతుందని ‘జీ 5’ పేర్కొంది.