సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. చాపకింద నీరులా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ రోగుల సంఖ్య పెరుగుతోంది. గురువారం తాజాగా 920 కేసులు నమోదయ్యాయి. ఇలా రాష్ట్రంలో 11వేల పాజిటివ్‌కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి ఐదుగురు మృత్యువాతపడ్డారు. దీంతో మరణాల సంఖ్య 230కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో 737, రంగారెడ్డి జిల్లా నుంచి 86, మేడ్చల్‌జిల్లాలో 60, కరీంనగర్ జిల్లాలో 23 కేసుల చొప్పున నమోదయ్యాయి. ప్రస్తుతం 6,446 యాక్టివ్‌కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌బులిటెన్‌లో పేర్కొంది.
- June 25, 2020
- Archive
- తెలంగాణ
- CARONA
- HYDERABAD
- TELANGANA
- కరోనా
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on ఒకేరోజు 920 కరోనా కేసులు