సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా(కోవిడ్19) కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. సోమవారం రాష్ట్రంలో కొత్తగా 1,831 పాజిటివ్కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కేసులు 25,733కు చేరాయి. మహమ్మారి బారినపడి తాజాగా 11 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు 1,22,218 మందికి కరోనా టెస్టులు చేశారు. ఇప్పటివరకు 306 మంది మృత్యువాతపడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,419 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలో 160, మేడ్చల్ జిల్లాలో 117 కేసులు, మెదక్లో 20, మంచిర్యాల జిల్లాలో 20, ఖమ్మం జిల్లాలో 21 చొప్పున కేసులు నిర్ధారణ అయ్యాయి.
- July 6, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- GHMC
- POSITIVE CASES
- TELANGANA
- కరోనా
- తెలంగాణ
- పాజిటివ్కేసులు
- Comments Off on ఒకేరోజు 1,831 కేసులు