అందం, అభినయం కలగలిసిన శ్రియా శరన్ హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి ఇరవై ఏళ్లు కావస్తోంది. పెళ్లి కూడా చేసుకుంది. అయినా అవకాశాలేమీ తగ్గలేదు. మనసుకు నచ్చిన సినిమాలు చేస్తూ కెరీర్ కి ఏ మాత్రం మైనస్ లేకుండా చూసుకుంటోంది. ఒకవైపు ‘ఆర్ఆర్ఆర్’లో అజయ్ దేవగన్‌కి జంటగా నటిస్తూనే.. మరోవైపు ‘గమనం’ అనే రియల్ లైఫ్ డ్రామాలో నటిస్తోంది. సుజనారావు అనే కొత్త దర్శకురాలు పరిచయమవుతోంది. శుక్రవారం శ్రియా శరణ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీలోని తన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని ప్రముఖ దర్శకుడు క్రిష్ చేత రిలీజ్ చేయించారు. చీర కట్టు, మెడలో మంగళసూత్రంతో ఓ సాధారణ గృహిణిలా ఏదో ఆలోచిస్తున్న ఎక్స్ ప్రెషన్‌తో ఈ పోస్టర్ లో శ్రియ కనిపిస్తోంది. షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. రమేష్ కరుటూరి, వెంకీ పుషడపు లతో కలిసి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ నిర్మిస్తున్నారు. ఇళయరాజా ఈ మూవీకి సంగీతం అందిస్తుండటం విశేషం. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. మొత్తానికి శ్రియ కూడా ఈ సినిమాతో లేడీ ఓరియంటెడ్ మూవీస్ పై దృష్టి పెడుతోందని అర్థమవుతోంది. అయితే ఇది ఇది శ్రియా కెరీర్ కి ఎంతవరకూ ప్లస్ అవుతుందో చూడాలి.
- September 11, 2020
- Archive
- Top News
- సినిమా
- BHENNAI
- BIRTHDAY
- HYDERABAD
- KRISH
- MUMBAI
- NEWMOVIE
- SHREYA SARAN
- శ్రియాసరన్
- హైదరాబాద్
- Comments Off on ఏ తీరాల వైపో ఈ ‘గమనం’