అక్రమాస్తుల కేసులో ఏసీబీ చిక్కిన మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఆస్తులు చూస్తుంటే ఏసీబీ అధికారులకే దిమ్మతిరిగిపోతుందట. అతడికి ఏకంగా రూ. 100 పైనే ఆస్తులున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో నరసింహారెడ్డిని విచారిస్తున్నారు. నరసింహారెడ్డికి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో 55 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు సమాచారం. మరోవైపు నిన్న జరిపిన సోదాల్లో ఏసీపీ ఇంట్లో 15 లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు గుర్తించారు. హైదరాబాద్‌లో రెండు ఇండ్లు, హఫీజ్‌పేట్‌లో 3 జీ ప్లస్ కమర్షియల్ కాంప్లెక్స్‌లు, సైబర్ టవర్స్ ముందు 4 ఓపెన్‌ప్లాట్లు, అనంతపురం జిల్లాలో 55 ఎకరాల వ్యవసాయభూమి. అయితే లాకర్లను చూస్తే మరిన్ని వివరాలు బయటపడనున్నట్టు సమాచారం. అయితే ఇటీవల నరసింహారెడ్డి ఘట్‌కేసర్ సమీపంలోని యమాన్ పేట్‌లో.. 30 ఎకరాల వివాదాస్పద భూమిని కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అయితే ఇందులో ఓ ప్రజాప్రతినిధి పాత్ర కూడా ఉన్నట్టు టాక్
ఏసీబీ ఆస్తుల చిట్టా ఇదే..!
- ఏసీపీ అక్రమాస్తులు @ రూ.100కోట్లపైనే
- అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయ భూమి
- మాదాపూర్ లో సైబర్ టవర్స్ ముందు 4 ప్లాట్లు
- 2 హౌస్ ప్లాట్లు ( హైదరాబాద్)
- హఫీజ్ పేట్ లో కమర్షియల్ జీప్లస్ 3 బిల్డింగ్
- 2 ఇళ్లు ( హైదరాబాద్)
- రూ.15 లక్షల నగదు
- 2 బ్యాంకు లాకర్లు
- రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు