Breaking News

ఏపీలో 8,555 పాజిటివ్‌ కేసులు

ఏపీలో 8,555 పాజిటివ్‌ కేసులు


  • 1,58,764కు చేరిన కేసుల సంఖ్య
  • ఒకరోజులో 63 మంది మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో 8,555 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 52,834 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 1,58,764 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు. వారిలో ఇప్పటి వరకు 82,886 మంది డిశ్చార్జ్‌ కాగా, తాజాగా 63 మంది చనిపోయారు. దీంతో చనిపోయిన వారి సంఖ్య 1474కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,65,407 కరోనా టెస్టులు చేశారు.