అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం 7,665 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 80 మంది మృతిచెందారు. మృతుల సంఖ్య 2,116కు చేరింది. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 2,35,525కు చేరింది. గత 24 గంటల్లో 46,699 కరోనా టెస్టులు చేశారు. కొత్తగా 6,924 మంది వైరస్ బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,45,636కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 87,112 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 25,34,304 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 631, చిత్తూరు 479, ఈస్ట్‌గోదావరి 1235, గుంటూరు 621, కడప 439, కృష్ణా 146, కర్నూలు 883, నెల్లూరు 511, ప్రకాశం 450, శ్రీకాకుళం 354, విశాఖపట్నం 620, విజయనగరం 574, వెస్ట్‌గోదావరి 722 చొప్పున పాజిటివ్‌కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో వివరాలను వెల్లడింది.