సారథిన్యూస్, అమరావతి: సరదాగా ఆడుకోవడానికి కారులోకి వెళ్లిన చిన్నారులు డోర్ లాక్కావడంతో ఊపిరాడక మృతిచెందారు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లెలో చోటు చేసుకుంది. అప్సానా ,యాసిన్ ,పర్వీన్ అనే ముగ్గురు చిన్నారులు ఆడుకోవడం కోసం తమ ఇంటి దగ్గర పార్క్ చేసిన కారులోకి ఎక్కారు. అయితే ప్రమాదవశాత్తూ ఆ కారు డోర్ లాక్ అయ్యింది. దీంతో ఆ చిన్నారులు బయటకు వచ్చేందుకు ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. దీంతో ముగ్గురు చిన్నారులు ఊపిరాడక కారులోనే ప్రాణాలు వదిలారు. వీరి కోసం తల్లిదండ్రులు గాలించగా, చివరకు కారులో విగతజీవులుగా కనిపించారు. చిన్నారుల మరణంతో ఆ కాలనీలో విషాధం అలుముకున్నది.
- August 8, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- క్రైమ్
- ANDRAPRADESH
- CAR
- CRIME
- DEATH
- KIDS
- ఏపీ
- చిన్నారులు
- మృతి
- Comments Off on ఊపిరాడక చిన్నారుల మృతి