Breaking News

ఉద్యమంలా హరితహారం


సారథి న్యూస్​, హైదరాబాద్​: ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అధికారులకు సూచించారు. సోమవారం ఆయన హైదరాబాద్​ నుంచి అన్ని జిల్లాల అడిషనల్​ కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీఆర్డీవోలు, డీపీవోలు, ఎంపీడీవోలు, ఏపీవోలతో వీడియాకాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడారు. జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణకు పాటుపాడాలన్నారు. జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు పర్యవేక్షించాలని సూచించారు.