సారథి న్యూస్, హైదరాబాద్: సీఎం కేసీఆర్ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సమర్థవంతమైన, కచ్చితమైన సేవలు అందించేందుకు ఈ-ఆఫీసును ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. బీఆర్కేఆర్భవన్లో కొనసాగుతున్న సెక్రటేరియట్ లోని 8 ప్రభుత్వ శాఖల్లో సేవలను సోమవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ-ఆఫీసు ద్వారా పారదర్శకమైన, బాధ్యతాయుతంగా, వేగంగా ప్రాసెస్ చేయడానికి వీలు కలుగుతుందన్నారు. ఎక్కడి నుంచైనా పనిచేయడానికి వీలవుతుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 15 శాఖల్లో అమలు చేస్తున్నామని వెల్లడించారు. మిగతా శాఖల్లో వారం రోజుల్లోగా పూర్తిచేయాలని సూచించారు. కార్మికశాఖ స్పెషల్ సీఎస్ రాణికుముదిని, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, పీసీబీ మెంబర్ సెక్రటరి నీతూ కుమారిప్రసాద్, ఆర్థికశాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్, షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ స్పెషల్ సెక్రటరీ విజయ కుమార్ పాల్గొన్నారు.