సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న మంత్రి కె.తారక రామారావు శుక్రవారం సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. త్వరలో జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 85వేల ఇళ్లను పేదలకు అందించేలా ముందుకు పోతున్నామని, దీనికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశామన్నారు. సమావేశంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.
- September 4, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CHEVELLA
- GHMC
- HYDERABAD
- MINISTER KTR
- జీహెచ్ఎంసీ
- మంత్రి కేటీఆర్
- హైదరాబాద్
- Comments Off on ఇళ్ల పంపిణీకి లబ్ధిదారులను గుర్తించండి