సారథి న్యూస్, హైదరాబాద్ : విద్యాసంవత్సరం ప్రారంభంపై ఇప్పుడే చెప్పలేమని ప్రభుత్వం పేర్కొంది. విద్యా సంవత్సరం ప్రారంభమనేది కరోనా పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని నివేదికలో తెలిపింది. కరోనా తీవ్రత వల్ల చాలా రాష్ట్రాలు ఇంకా విద్యాసంవత్సరం ఖరారు చేయలేదని చెప్పింది. అనువైన విద్యాసంవత్సరం ఖరారు చేసే పనిలో ఉన్నామని కోర్టుకు విన్నవించింది. అదనపు ఆర్థికం భారం లేని బోధన పద్ధతులపై కసరత్తు జరుగుతోందని తెలిపింది. విద్యాసంవత్సరం, నిరంతర అభ్యసన విధానం ఖరారయ్యాక ఆన్‌లైన్ తరగతులపై మార్గదర్శకాలు జారీచేస్తామని పేర్కొంది. స్కూళ్ల ప్రారంభంపై తల్లిదండ్రుల ఫీడ్‌బ్యాక్ తెలపాలని కేంద్రం కోరిందని, ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇప్పటికే డీఈవోలను ఆదేశించామని, ఆగస్టు 5 వరకు సమయం ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని చెప్పింది. ప్రభుత్వ పాఠశాలలు తెరిచే వరకు టీవీలు, ఆన్‌లైన్‌లో పాఠాలు కొనసాగించేలా ముసాయిదా పాలసీ సిద్ధంగా ఉందని ప్రభుత్వం వివరించింది. డిజిటల్ విద్యపై ఈ నెల 14న ఎన్‌సీఈఆర్‌టీ మార్గదర్శకాలు జారీ చేసిందని, విద్యారంగ నిపుణులతో చర్చించాక పాలసీపై తుది నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు ప్రభుత్వం విన్నవించింది.
- July 23, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CARONA
- HIGHCOURT
- TELANGANA
- తెలంగాణ
- విద్యారంగం
- హైకోర్టు
- Comments Off on ఇప్పుడేం చెప్పలేం..