సారథి న్యూస్, కరీంనగర్: సీఎం కేసీఆర్ రాచరికపు పోకడలతో తెలంగాణ అస్థిత్వాన్ని సర్వనాశనం చేస్తున్నారని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు విమర్శించారు. అమరవీరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు వీఆర్వో వ్యవస్థ రద్దు అనే అంశాన్ని తెరమీదకు తెచ్చారని ఆరోపించారు. పేదల కష్టపడి డబ్బుసంపాధించి.. ఆ డబ్బులతో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తే ఎల్ఆర్ఎస్ పేరుతో దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. ఈ సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షుడు మడుపు మోహన్, నగర బీసీ సెల్ ప్రెసిడెంట్ బోనాల శ్రీనివాస్, కరీంనగర్ నగర ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ లింగంపల్లి బాబు, రోళ్ల సతీశ్, బానోతు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
- September 10, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CONGRESS
- KARIMNAGAR
- KCR
- LAND
- REVENUE
- కరీంనగర్
- కాంగ్రెస్
- టీఆర్ఎస్
- Comments Off on ఇదేనా బంగారు తెలంగాణ