సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా సీపీఎం నాయకుడు టి.షడ్రక్, గిరిజన ఉద్యమ నాయకుడు, సీపీఎం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని సీఐటీయూ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గౌస్ దేశాయ్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక మార్కెట్ యార్డులో అన్ని యూనియన్ల ఆధ్వర్యంలో సంతాపసభ నిర్వహించారు. షడ్రక్ కార్మికుల పక్షాన ఎన్నో పోరాటాలు చేశారని గుర్తుచేశారు. ప్రజాప్రతినిధిగా స్థానికుల సమస్యల పరిష్కారం కోసం విశేషంగా కృషిచేశారని అన్నారు. సీపీఎంలో సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు సున్నం రాజయ్య ఎదిగారన్నారు. ఇద్దరు నేతల జీవితాలు ఆదర్శమన్నారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు ఎం.రాజశేఖర్, గోపాల్, సోమన్న, వెంకటేశ్వర్లు, పరశురాముడు, మౌలాలి, మనోహర్, మార్కెట్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
- August 6, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- కర్నూలు
- లోకల్ న్యూస్
- ANDRAPRADESH
- CITU
- CPM
- Kurnool
- ఆంధ్రప్రదేశ్
- కర్నూలు
- షడ్రక్
- సీఐటీయూ
- సీపీఎం
- సున్నం రాజయ్య
- Comments Off on ఆ ఇద్దరి నేతల మృతి తీరనిలోటు