సారథిన్యూస్, రామడుగు: పేదరికం ఆ కుటుంబాన్ని చిదిమేసింది. విధి వెక్కిరించింది. చిన్న వయసులోనే ఇద్దరు పిల్లల నా అనేవాళ్లకు దూరమై అనాథలయ్యారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రుద్రారం గ్రామానికి చెందిన గుర్రం వనిత (17), గుర్రం నవీన్ కుమార్(6)ల తల్లిదండ్రులు నాలుగేండ్ల క్రితం ఓ ప్రమాదంలో చనిపోయారు. దీంతో వాళ్ల నాన్నమ్మే పిల్లలిద్దరినీ పెంచి పోషించింది. సోమవారం వాళ్ల నాన్నమ్మ కూడా తుదిశ్వాస విడిచింది. దీంతో వీరు అనాథలయ్యారు. ప్రస్తుతం ఆ చిన్నారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారి పరిస్థితిని చూసిన గ్రామస్థులు కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆ చిన్నారులను ఆదుకోవాలని.. వారి విద్య, వసతులు కల్పించాలని కోరుతున్నారు.
- September 15, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- ACCIDENT
- KARIMNAGAR
- PARENTS
- TELANGANA
- కరీంనగర్
- తల్లిదండ్రులు
- హైదరాబాద్
- Comments Off on ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి