జైపూర్: రాజస్థాన్ పొలిటికల్ డ్రామా రోజుకో మలుపు తిరుతున్నది. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనాలని చూస్తోందని ఆరోపించిన కాంగ్రెస్, 19 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ మరో ముందు అడుగు వేసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలతో బేరాలు ఆడారని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షకావత్, కాంగ్రెస్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మపై కేసు పెట్టింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి అమ్ముడు పోయారని విచారణలో వెల్లడైందని చెప్పింది. బీజేపీతో డీలింగ్ పెట్టుకున్నారని ఆడియో ప్రూఫ్ ఉందని, దాని ఆధారంగా భన్వర్‌లాల్‌తో పాటు మరికొంత మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పింది. భన్వర్‌లాల్ బీజేపీ నేతలతో చర్చలు జరుపుతున్న రెండు ఆడియో క్లిప్పింగులు బయటికి వచ్చాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. ‘కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షకావత్, బీజేపీ లీడర్లు సంజై జైన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే భన్వర్ లాల్ శర్మ ముగ్గురు ఫోన్‌లో మాట్లాడిన రెందు ఆడియో క్లిప్స్ బయటికి వచ్చాయి. భన్వర్‌లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌ని పార్టీ నుంచి తొలగించాం. వాళ్లకు షో కాజ్ నోటీసులు కూడా ఇచ్చాం’ అని సుర్జేవాలా చెప్పారు. కాగా ఆ ఆరోపణలను శర్మ ఖండించారు. అది తన గొంతు కాదని, ఫేక్ అని అన్నారు. రాజస్థాన్‌లో గత కొద్ది రోజులుగా పొలిటికల్ క్రైసిస్ నెలకొంది. రాజ్యసభ ఎన్నికలప్పటి నుంచి కాంగ్రెస్ నేతలు బీజేపీపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారని సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సచిన్‌పైలెట్ తిరుగుబాటు చేయడంతో బీజేపీనే అతని వెనక ఉండి డ్రామా ఆడిస్తుందని ఆరోపించిన విషయం తెలిసిందే.
- July 17, 2020
- Archive
- Top News
- జాతీయం
- BJP
- DRAMA
- JAIPUR
- MLA
- POLITICS
- RAJASTHN
- కాంగ్రెస్
- రాజస్థాన్
- Comments Off on ఆడియో క్లిప్పులతో దొరికిపోయారు