ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌కు ఆ పార్టీ అధిష్ఠానం గట్టి షాకే ఇచ్చింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆజాద్‌ను తొలిగించింది. ఆజాద్‌తో పాటూ అంబికా సోని, మల్లికార్జున ఖర్గే, మోతీలాల్ వోరా తదితరులపై కూడా వేటు పడింది. కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన అవసరం అంటూ ఇటీవల ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖరాసిన వారిలో ఆజాద్ ముఖ్యుడు. ఈ విషయంపై పార్టీలో తీవ్ర దుమారం చెలరేగింది. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ సైతం పార్టీ సీనియర్లపై సీరియస్ అయ్యారు. కాగా కాంగ్రెస్ పార్టీ తాజాగా సీడబ్ల్యూసీని పునర్వ్యస్థీకరించింది. ఈ కమిటీలో పలువురు సీనియర్లను పక్కన పెట్టింది. ఆజాద్ ఇప్పటివరకు యూపీ కాంగ్రెస్ ఇంచార్జిగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయనను ఆ పదవినుంచి కూడా తప్పించారు.
తెలంగాణ ఇంచార్జిగా మాణికం ఠాకూర్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జిగా మాణికం రాకూర్ను కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఇప్పటివరకు ఇక్కడ ఇంచార్జిగా ఉన్న కుంతియాను తప్పించారు. యూపీ కాంగ్రెస్ ఇంచార్జిగా ప్రియాంకా గాంధీ, ఆంధ్రప్రదేవ్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా ఉమెన్‌చాందీని కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ఓ ప్రకటనను విడుదల చేసింది.