సారథిన్యూస్, రామడుగు: మోతే రిజర్వాయర్ నిర్మాణంపై అవగాహన లేకే కాంగ్రెస్ నేతలు ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారని సింగల్విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర్రావు విమర్శించారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా రామడుగులో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ను విమర్శించే స్థాయి మేడిపల్లి సత్యానికి లేదని పేర్కొన్నారు. మోతే రిజర్వాయర్ తూముల గురించి సరైన అవగాహన లేకుండా సత్యం నోటికొచ్చిన ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే సహించేది లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు గంట్లా వెంకట్ రెడ్డి, ఒంటెల మురళీకృష్ణ రెడ్డి, మారుకొండ క్రిష్ట రెడ్డి, కల్గెటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
- August 31, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- KARIMNAGAR
- KCR
- MLA
- RAMADUGU
- RAVISHANKAR
- TELANGANA
- TRS
- ఎమ్మెల్యే
- తెలంగాణ
- సుంకె రవిశంకర్
- Comments Off on అవగాహన లేకే ఆరోపణలు