సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఉమ్మడి మండలంలోని పుల్లూరు గ్రామంలో ఏర్పాటుచేసిన పుష్కర ఘాట్ లో బుధవారం ఏకాదశి రోజున ప్రభాత సంకీర్తనం, అమ్మవారి పుష్కరస్నానం కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని సర్పంచ్ నారాయణమ్మ, గ్రామస్తులు గిరిధర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, గజేందర్ రెడ్డి, ఏకాంత్, నీలప్ప తెలిపారు. జ్యోతిర్వాస్తు పీఠాధిపతి మహేశ్వర సిద్ధాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. రెండొందల మంది బ్రాహ్మణులతో ప్రత్యేకపూజలు, అమ్మవారికి పుష్కరస్నానం ఉంటుందని పేర్కొన్నారు. ఆ తర్వాత అమ్మవారిని చెన్నకేశవ ఆలయం నుంచి పురవీధుల గుండా ఊరేగింపు, చెన్నకేశవుని ఆలయంలో లక్ష తులసీ దళ అర్చన కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు. ఆ తర్వాత మహా హారతి, అనంతరం స్థానదేవత దర్శనం, భక్తుల తీర్థప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు.
- November 24, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
- ALAMPUR
- GADWALA
- JOGULAMBA
- MANAVAPADU
- TUNGABADRA
- అలంపూర్
- గద్వాల
- జోగుళాంబ
- తుంగభద్ర
- మానవపాడు
- Comments Off on అమ్మవారికి పుష్కర స్నానం