![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/DEVOOLOPMENT.jpg?fit=905%2C529&ssl=1)
సారథిన్యూస్, రామడుగు: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి చిరునామా అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు సోమవారం MLA సుంకే రవిశంకర్ శంకుస్థపాన చేశారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మైదానంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, సర్పంచ్ జీవన్, ఎంపీపీ కవిత నాయకులు జితేందర్ రెడ్డి, కర్ణాకర్, కల్గెటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.