Breaking News

అధికారులూ.. అలర్ట్​గా ఉండండి

అధికారులూ.. అలర్ట్​గా ఉండండి

సారథి న్యూస్​, హైదరాబాద్​: వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులు, ప్రజలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సూచించారు. రాష్ట్రంలో చాలాచోట్ల ఆదివారం వర్షాలు కురుస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులంతా ఎక్కడివారు అక్కడే ఉండి పరిస్థితిని గమనిస్తూ అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. భారీవర్షాలు, వాటితో పాటే వరదలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.