సినిమా తారలు, క్రీడాకారుల వ్యక్తిగత సంబంధాలపై పుకార్లు రావడం కొత్త కాదు. కొందరు ఆకతాయిలు సోషల్‌మీడియా వేదికగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఇష్టమొచ్చినట్టు పుకార్లు పుట్టిస్తున్నారు. తాజాగా నటి తమన్నా పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో ప్రేమలో పడిందంటూ సోషల్ మీడియా కోడై కూసింది. ఓ నగల షాప్‌లో రజాక్‌తో కలిసి తమన్నా నగలు కొనుగోలు చేస్తున్నదంటూ ఓ ఫొటోను కూడా సోషల్‌మీడియాలో వైరల్ చేశారు. దీంతో విసుగు చెందిన మిల్కీబ్యూటీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది. రజాక్ తన బాయ్‌ఫ్రెండ్ కాడని స్పష్టం చేసింది. ఓ నగల దుకాణం ఓపెనింగ్ సమయంలో తీసిన ఫొటోను పట్టుకొని తనను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారంటూ మండిపడింది మిల్కీ బ్యూటీ. ‘ఒకరోజు నటుడి పేరు చెప్తారు. మరో రోజు క్రికెటర్ అంటారు, ఇంకోసారి డాక్టర్ అంటారు, ఇప్పడేమే క్రికెటర్ అంటున్నారు. ఇలా అందరితో రిలేషన్‌షిప్ అంటగట్టడం ఏంటి’ అని కడిగి పారేసింది. తాను ఎవరితోనూ డేటింగ్‌లో లేనని క్లారిటీ ఇచ్చేసింది. గతంలో దుబాయ్‌లోని ఓ నగల షాపు ఓపెనింగ్ సందర్భంగా ఈ ఫోటో తీసినట్టు చెప్పారు.
- June 28, 2020
- Archive
- సినిమా
- CRICKETER
- PAK
- TAMMANNA
- TOLLYWOOD
- అబ్దుల్ రజాక్
- తమన్నా
- Comments Off on అతడు నా బాయ్‌ఫ్రెండ్ కాదు