సారథిన్యూస్, గద్వాల: లంచం తీసుకుంటూ జోగుళాంబ గద్వాల జిల్లా డీఎంహెచ్‌వో భీమ్‌నాయక్ ఏసీబీ అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని వడ్డేపల్లి మండలంలో డాక్టర్ ఏ మంజుల మెడికల్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె కాకతీయ యూనివర్సిటీలో పీజీలో జాయిన్ అయ్యారు. ఇందుకోసం రిలీవింగ్ ఆర్డర్ కోసం డీఎంహెచ్‌వోకు దరఖాస్తు చేసుకున్నారు. లంచాలకు అలవాటు పడ్డ డీఎంహెచ్‌వో తన కిందిస్థాయి ఉద్యోగిని సైతం రూ. 7000 లంచం అడిగాడు. దీంతో మంజుల ఏసీబీని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన అధికారులు గురువారం సదరు డీఎంహెచ్‌వో తన కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా రెడ్హ్యెండెడ్గా పట్టుకున్నారు.
- July 23, 2020
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- ACB
- DMHO
- GADWAL
- MEDICAL
- ఏసీబీ
- డాక్టర్
- Comments Off on అడ్డంగా దొరికిన పెద్ద డాక్టర్