సారథి న్యూస్, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, శాసనసభ ప్రతిపక్ష ఉపనేత, టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో శుక్రవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వేకువజామునే గ్రామానికి విజయవాడ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చారు. ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకుని ప్రత్యేక బస్సులో విజయవాడకు తరలించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయనపై ఈఎస్ఐ నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు ఉన్నాయి. అచ్చెన్నాయుడి అరెస్ట్ నేపథ్యంలో నిమ్మాడ గ్రామంలో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు.
- June 12, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- ATCHANNAIDU
- NIMMADA
- SRIKAKULAM
- అచ్చెన్నాయుడు
- ఏసీబీ
- కోటబొమ్మాళి
- నిమ్మాడ
- శ్రీకాకుళం
- Comments Off on అచ్చెన్నాయుడు అరెస్ట్