అక్కినేని అఖిల్.. బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే లాక్‌డౌన్‌తో ఈ చిత్ర షూటింగ్ ఆగిపోగా.. ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా పూజాహెగ్డే ‘ద బ్యాండ్ ఈజ్ బ్యాక్’ అంటూ అఖిల్, పూజాహెగ్డే ఉన్న ఓ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అయితే ఈ ఫొటోపై నెట్టింట్లో ఆసక్తికరమైన కామెంట్లు వచ్చాయి. పూజాహెగ్డే .. అఖిల్‌కు అక్కలా ఉందంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఇప్పటికే పూజపై కొన్ని సీన్స్ చిత్రీకరించారు. తాజాగా అఖిల్ షూట్‌లో జాయిన్ అయ్యాడు. కాగా ‘ఈ కరోనా టైమ్‌లో రొమాంటిక్-కామెడీని చిత్రీకరించే ప్రయత్నంలో మేమిద్దరం మాత్రమే సామాజిక దూరం పాటించడం లేదు..’ అంటూ పూజ కామెంట్ చేసింది.
- September 18, 2020
- Archive
- Top News
- సినిమా
- AKHIL AKKINENI
- AP
- DEKHI
- DRUGS
- FILMCITY
- HYDERABAD
- MUMBAI
- NEWMOVIE
- POOJA HEGDE
- అఖిల్
- ఢిల్లీ
- పూజాహెగ్డే
- హైదరాబాద్
- Comments Off on అఖిల్.. బుట్టబొమ్మ తమ్ముడిలా ఉన్నాడట!