
దుబాయ్: ఐపీఎల్ 13 సీజన్లో భాగంగా దుబాయ్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సూపర్బ్ అనిపించింది. పంజాబ్‌పై 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. 16.5 ఓవర్లలోనే 132 పరుగులకే అలౌట్చేసి ఔరా అనిపించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 6 వికెట్ల నష్టానికి 202 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. డేవిడ్ వార్నర్ 52(40 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్), బెయిర్ స్టో 97(55 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) మంచి శుభారంభం అందించారు. దీంతో హైదరాబాద్ భారీ స్కోరు చేసింది. కింగ్స్ పంజాబ్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 3 వికెట్లు సాధించగా, అర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీశాడు. మహ్మద్ షమీకి ఒక వికెట్ లభించింది. లక్ష్య సాధనలో భాగంగా కింగ్స్ పంజాబ్ ఆటగాళ్లలో నికోలస్ పూరన్ 77(37 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) మినహా ఎవరూ రాణించకపోవడంతో 16.5 ఓవర్లలోనే 132 పరుగులకే పరాజయం పాలైంది. ఇక సన్‌రైజర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు సాధించగా, ఖలీల్ అహ్మద్, నటరాజన్ రెండు వికెట్ల చొప్పున సాధించారు. అభిషేక్ శర్మకు వికెట్ లభించింది. ఇద్దరు పంజాబ్ ఆటగాళ్లు రనౌట్ అయ్యారు.