Breaking News

రేణుకా చౌదరి ఇంట్లో చోరీ

రేణుకా చౌదరి ఇంట్లో చోరీ

హైదరాబాద్‌: కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నాయకురాలు రేణుకాచౌదరి ఇంట్లో చోరీ జరిగింది. రూ.3లక్షల నగదు,3.5 లక్షల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు మంగళవారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో పనిచేసే ముగ్గురు వ్యక్తులను అనుమానిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పనిమనుషులందరినీ విచారించిన తర్వాతే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.