దుబాయ్: టీ20 మ్యాచ్‌ల్లో అభిమానులకు ఇదీ సిసలైన మ్యాచ్.. మొదటి మ్యాచ్ టై కాగా, సూపర్ ఓవర్ మ్యాచ్ కూడా టై అయింది. మరో సూపర్ ఓవర్ మ్యాచ్ గెలుపును తేల్చింది. ఈ ఉత్కంఠభరిత పోరు ఐపీఎల్ 13 సీజన్లో భాగంగా దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆవిష్కృతమైంది. నరాలు తెగే టెన్షన్ మధ్య పంజాబ్ విజయం సాధించింది.
అంతకు ముందు ముంబై నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కింగ్స్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. కేఎల్ రాహుల్ (77;51 బంతుల్లో 4×7, 6×3) దుమ్ములేపాడు. లక్ష్య ఛేదనలో కింగ్స్ పంజాబ్ ఆదిలోనే మయాంక్ అగర్వాల్ (11) వికెట్ కోల్పోయింది. క్రిస్ గేల్(24; 21 బంతుల్లో 4×1, 6×2), నికోలస్ పూరన్(24; 12 బంతుల్లో 4×2, 6×2) స్కోరు బోర్డును పరుగెత్తించారు. ముంబై బౌలర్లలో బుమ్రా మూడు, ఆర్డీ చాహర్ రెండు వికెట్ల చొప్పున తీశారు.
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 176 పరుగులు చేసింది. రోహిత్‌శర్మ 9, డికాక్ (53, 43 బంతుల్లో 3×4), హార్దిక్ పాండ్యా 34( 30 బంతుల్లో, 4×1, 6×1), కేఏ పొలార్డ్(34, 12 బంతుల్లో 4×1, 6×4), కట్లర్నీలే (24, 12 బంతుల్లో 4×4) పరుగులు చేయగా, మిగతావారు రెండెంకల స్కోరును దాటలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఇక కింగ్స్ లెవెన్ పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ, అర్షద్దీప్ సింగ్ రెండు వికెట్ల చొప్పున, జోర్డన్, రవిబిష్ణోమ్ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
సూపర్ ఓవర్ సాగిందిలా..
ముందు జరిగిన సూపర్ ఓవర్ టై కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. తొలి సూపర్ ఓవర్లో రెండుజట్లు ఐదు చొప్పున సమానంగా పరుగులు చేయడంతో రెండో సూపర్ ఆడించారు. ముంబై 11 పరుగులు చేయగా, దాన్ని పంజాబ్ ఛేదించింది.