Breaking News

గవాస్కర్​జీ ఏంటా మాటలు! అనూష్క ఫైర్​


మాజీ క్రికెట​ర్​ సునీల్​ గవాస్కర్​పై టీంఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ భార్య ప్రముఖ హీరోయిన్​ అనూష్య శర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మ్యాచ్​ వైఫల్యాల సమయంలో క్రికెటర్ల భార్యలపై నిందలు మోపడం సరికాదని.. ద్వందార్థాలు వచ్చేలా అసభ్యంగా మాట్లాడం సరికాదని అనూష్క వ్యాఖ్యానించారు. ఇంతకూ గవాస్కర్​ తన కామెంట్రీలో ఏమన్నారు.. ‘ఏ క్రికెటర్​ అయినా ఎంత ఎక్కువ ప్రాక్టీస్​ చేస్తే అంత మెరుగవుతాడు. కానీ కోహ్లీ మాత్రం లాక్​డౌన్​ సమయంలో ఆయన భార్యతోనే ప్రాక్టీస్​ చేసినట్టున్నాడు. అందుకే రాణించలేకపోతున్నాడు’ అంటూ వ్యాఖ్యానించాడు. కాగా ఈ వ్యాఖ్యలు సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి. దీనిపై అనూష్క చాలా సీరియస్​గా స్పందించారు. ‘గవాస్కర్​జీ మీ వ్యాఖ్యలు చాలా అసహ్యకరంగా ఉన్నాయి. కోహ్లీ ఆటపై వ్యాఖ్యానిస్తూ నన్ను ఎందుకు లాగారు.. క్రికెటర్ల భార్యలను వివాదాల్లోకి లాగడం మీకు సభ్యతగా అనిపిస్తున్నదా’ అంటూ ఆమె ఫైర్​ అయ్యారు. మరోవైపు గవాస్కర్​ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గర్భిణి అయిన అనూష్క శర్మపై ద్వందార్థం వచ్చేలా మాట్లాడం సరికదాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.